TTD: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి.. టీటీడీ ఏం చెప్పిందంటే?

TTD: తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ జెర్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఏం జరిగిందా అంటూ ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై టీటీడీ స్పందించింది. అసలు విషయాన్ని బయట పెట్టింది.

Update: 2024-10-06 02:15 GMT

TTD: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి.. టీటీడీ ఏం చెప్పిందంటే?

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తిరుమల ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారా . ఏది పడితే అది అసత్య ప్రచారం చేస్తూ భక్తులను భయపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఓ వీడియో తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి ఉందని చెబుతూ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి మీడియా కూడా దాన్ని జనాలకు చూపించింది. ఈ విషయం టీటీడీ వరకు వెళ్లింది. వెంటనే టీటీడీ నుంచి స్పందన వచ్చేసింది.

తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి కనిపించిందన్న వార్తలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఇదంతా అబ్బందమంటూ చెప్పింది. వేల మందికి వడ్డించేందుకు ప్రసాదం రెడీ చేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి పుకార్లను నమ్మకూడదు అంటూ టీటీడీ విజ్నప్తి చేస్తోంది ఓ ప్రకటనలో టీటీడీ తెలిపింది.

తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగన్నంలో జెర్రి వచ్చినట్లు ఆ వీడియో వైరల్ అయ్యింది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుడి ఆకులో జెర్రి కనిపించింది. ఈ క్రమంలో అన్న ప్రసాదంలో జెర్రి కనిపించిందనీ భక్తులు షాక్ అయ్యారన్న ప్రచారం జరిగింది. ఈ విషయంపై భక్తులు వెంటనే టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. అయితే ఇదంతా అబద్దమని టీటీడీ ఓ ప్రకటనతో తేలింది.

అసలు అలాంటి అసత్య ప్రచారాలు చేసేవాళ్లను పట్టుకుని చట్టప్రకారం శిక్షించాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే తిరుమలలో రోజూ వేల మంది భక్తులు అన్నప్రసాదాలను తీసుకుంటారు. వారంతా ఎంతో భక్తితో భోజనాలు చేస్తుంటారు. అంతమందికి అన్ని రకాల అన్న ప్రసాదాలు చేసి, వడ్డించడం మామూలు విషయం కాదు. రోజూ లక్షల మంది ఇలా ఫ్రీగా అన్న ప్రసాదాలను తీసుకుంటారు. ఎవరు, ఎప్పుడూ ఇలాంటి ప్రచారం చేయలేదు. చాలా జాగ్రత్తగా టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలను భక్తుల కోసం సిద్ధం చేస్తుంటారు. అలాంటి వారి క్రుషికి మెచ్చుకోవల్సింది పోయి, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం చాలా దారుణమైన విషయం. తిరుమల అంటే అంత చిన్న చూపా భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఆ అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఆ వీడియో షేర్ చేసినవారికి శిక్షిస్తేనే ఇలాంటి దుర్మార్గాలకు బ్రేక్ పడుతుందని భక్తులు అంటున్నారు.


Tags:    

Similar News