Pulivendula: వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
* ట్యాంకర్ల సాయంతో వ్యర్ధపు నీటిని తోడుతున్న మున్సిపల్ సిబ్బంది * బురద ఎక్కువగా ఉండడంతో అన్వేషణలో ఆలస్యం
Pulivendula: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందుల రోటరీపురం వాగులో సీబీఐ అధికారులు రెండో రోజు ఆయుధాల కోసం అన్వేషిస్తున్నారు. ట్యాంకర్ల సాయంతో వ్యర్ధపు నీటిని మున్సిపల్ సిబ్బంది తీస్తున్నారు. బురద ఎక్కువగా ఉండడంతో ఆయుధాల దొరికేందుకు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయుధాల అన్వేషణ కోసం సీబీఐ అధికారులు రెండోరోజు మరికొన్ని ఆయిల్ ఇంజిన్లు, ప్రొక్లైన్ యంత్రాలను వాడుతున్నారు. ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తర్వాత విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఆయుధాల దొరికిన తర్వాత సునీల్ యాదవ్‌ను మరింత లోతుగా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.