Andhra Pradesh: బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా బడ్జెట్ ఆర్డినెన్స్ కి ఆమోదం

Update: 2021-03-27 01:27 GMT
ఏపీ గవర్నమెంట్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ కేబినెట్ తాజాగా బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా బడ్జెట్ ఆర్డినెన్స్ కి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 90 వేల కోట్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ కి ఆమోదం లభించింది. తాజాగా ఈ ఫైళ్లను రాష్ట్ర మంత్రులకు సర్క్యులేట్ చేసింది ప్రభుత్వం.

ఏపీ బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ఆర్డినెన్సును ఆన్‌లైన్‌లో మంత్రులు ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. 80వేల కోట్ల నుంచి 90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్‌ను రూపొందించారు. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించనుంది.

మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. ఈ నెల మూడో వారం, నెలాఖరులో సెషన్ నిర్వహించాలని భావించారు. కానీ వరుసగా ఎన్నికలు రావడం, కరోనా కేసులు పెరగడం, తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక ఉండటంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. గతేడాది కూడా కరోనా కారణంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే రిపీట్ అయ్యింది.

గత ఏడాది కూడా కరోనా వైరస్ నేపథ్యంలో అసెంబ్లీ సభ సమావేశం అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా పరిస్థితి అదే విధంగా పరిస్థితులు ఉండటంతో ఈ బడ్జెట్ కూడా ఆర్డినెన్స్ ద్వారానే గవర్నర్ ఆమోదముద్ర వేయించుకోవడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెలాఖరులోపు గవర్నర్ ఆమోదముద్ర వేసుకున్న తర్వాత ఈ ఆర్డినెన్స్ పై ఆరు నెలల లోపు ఉభయ సభలు సమావేశమై ఆమోదం చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News