కాబోయే భర్త గొంతు కోసిన యువతి.. సర్ప్రైజ్ అని చెప్పి కొండపైకి తీసుకెళ్లి..
విశాఖలో ఓ యువతి కాబోయే భర్త గొంతు కోసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Wedding: విశాఖలో ఓ యువతి కాబోయే భర్త గొంతు కోసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సర్ప్రైజ్ అంటూ.. తనకు ఆ యువతి ఫోన్ చేసిందని, ఆ తర్వాత కొండపైకి తీసుకెళ్లి.. కళ్లు మూసుకోవాలని చెప్పి.. గొంతు కోసిందని ఆరోపిస్తున్నాడు బాధితుడు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు తనను ఆస్పత్రిలో జాయిన్ చేశారని చెబుతున్నారు. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ సీన్ సోమవారం సాయంత్రం బుచ్చెయ్యపేట మండలం అమరపురి వద్ద జరిగింది.