Srivari Bramotsavam : భక్తులకు అలర్ట్..ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనలు, ఆర్జిత సేవలు రద్దు

Srivari Bramotsavam :తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 4వ తేదీ ధ్వజారోహణ, 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తామని ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వ్రుద్దులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

Update: 2024-08-04 01:55 GMT

 TTD Tickets: భక్తులకు అలర్ట్..నేడు డిసెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు రిలీజ్.. పూర్తి వివరాలివే

Srivari Bramotsavam : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. ఇక అక్టోబర్ 4వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్త్రుతం ఏర్పాట్లు చేస్తుందని ఈవో వెంకటచౌదరి తెలిపారు.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 4వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభంగా నిర్వహించేందుకు టీటీడీ అన్నీ ఏర్పాట్లు చేస్తోందని ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నయమ్య భవనంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో బ్రహ్మోత్సవాల గురించి తెలిపారు. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ పనులు, లడ్డూ బఫర్ స్టార్, వాహనాల ఫిట్‌నెస్, దర్శనం, అన్నప్రసాదం, వసతి, కళా బ్రుందాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్ పోర్టు, కల్యాణకట్ట, గోశాల, శ్రీవారి సేవకులు,విజిలెన్స్ ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటమని తెలిపారు.

అక్టోబర్ 4 నుంచి..

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 4వ తేదీ ధ్వజారోహణ జరుగుతుందన్నారు. 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వ్రుద్దులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News