నవమి శోభితం.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో రేపటి నుంచి బ్రహోత్సవాలు...
Sri Rama Navami 2022: ఈసారి లక్షమంది పైచిలుకు భక్తులు హాజరవుతారని అంచనా...
Sri Rama Navami 2022: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ప్రతియేటా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి హారజవడం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్ళు నిరాడంబరంగా సాగిన ఉత్సవాలు మళ్ళీ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది.
ఈ ఉత్సవాలు 18 తేదీ వరకు జరగనున్నాయి. ఈనెల 10నుంచి 18తేది వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 1550వ సంవత్సరం నుంచే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నట్లు చెబుతారు. శీతారాముల జన్మ వృత్తాంతాలు, రామాయణ విశేషాలలో ముఖ్యంగా అరణ్యవాసం గురించి చెప్పే ఎన్నో శిలా శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయంలో శ్రీరాముడు లక్ష్మణుడు సీతా దేవిని ఒకే శిలపై చెక్కారు.
అందుకే ఏక శిలా నగరం అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ ఆంజనేయుడు ఉండకపోవడం మరో ప్రత్యేకత. ఈసారి భక్తులు లక్షమంది పైచిలుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతం చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.టిటిడి చైర్మన్ తో పాటు టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.