బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంతో భూమా ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?
బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంతో భూమా ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే సంకేతాలు వస్తున్నాయి.
బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంతో భూమా ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే సంకేతాలు వస్తున్నాయి. ఏ1అఖిల ప్రియ ఆమే సోదరుడు విఖ్యాత్ రెడ్డి, భర్త భార్గవ్ రామ్ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. దీంతో రాజకీయ కోణాలు, వ్యక్తిగత ద్వేషాలు, ఇతర కారణాల వల్లే అఖిల ప్రియను ఇరకాటంలో పెడుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో ప్రవీన్, నవీన్, సునీల్ బ్రదర్స్ కిడ్నాప్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఏపీ మాజీ మంత్రి , టీడీపీ నేత భూమా అఖిల ప్రియను ఏ 1గా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అప్పటి వరకు బాగానే ఉన్నా అఖిల ప్రియ అరెస్ట్ ఆ తర్వాత ఆమెను కస్టడీలోకి తీసుకోవడం తిరిగి రిమాండ్‌కు తరలించడంతో ఈ కేసులో రాజకీయ కుట్ర దాగుందనే వాదనలు సైతం తెరపైకి వస్తున్నాయి.
అఖిల ప్రియ అరెస్ట్ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిందనే చెప్పాలి ఆమె కస్టడీ సమయంలో ఎన్నో ట్విస్టులు సైతం బయటకు వచ్చాయి...ఈ కేసులో అఖిల ప్రియతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తేల్చారు. ఐతే కేసు వెలుగులోకి వచ్చాక తమకు ఈ కిడ్నాప్ కు ఎలాంటి సంబంధం లేదని విచారణ లోతుగా చేయాలని అఖిల ప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి డిమాండ్ చేశాడు.
ఐతే కేసు విచారణలో భాగంగా కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. ఇక అప్పటి వరకు మీడియాలో హడావిడి చేసిన విఖ్యాత్ తన పేరు బయటకు వచ్చినప్పటి నుండి అజ్ఙాతంలోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు మాత్రం కిడ్నాప్ చేసిన తర్వాత బాధితులను తీసుకెళ్లిన వాహనాల్లో ఒకటి జగత్ విఖ్యాత్ డ్రైవ్ చేసినట్లు నిర్ధారించారు. ఈ పరిణామాలను చూస్తుంటే భూమా ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బోయిన్ పల్లి కిడ్నాప్‌కు ప్రధాన కారణం భూ వివాదం. అది సెటిల్ మెంట్ అవ్వగానే కిడ్నాప్‌కు తెర దీశారని తెలుస్తోంది. ఐతే హఫీజ్ పేటలోకి ఈ విలువైన ల్యాండ్స్‌లో ఇంకా చాలా మంది బడా బాబులు ఉన్నారని...వారి ఒత్తిడి వల్లనే అఖిల ప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. భాధితులు సీఎం కేసీఆర్‌కు సమీస బంధువులు కాబట్టే పోలీసులు సైతం అత్యుత్సాహం చూపిస్తూ కేసు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నగరశివారు ప్రాంతాల్లో ఎన్నో వివాదాస్ప భూములు ఉండగా కేవలం ఈ కేసులో మాత్రమే పోలీసులు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఇక భూమా అరెస్ట్ తర్వాత ఏపీ టీడీపీ నేతలెవ్వరూ స్పందించలేదు. పార్టీ కోసం ఎంతో సేవ చేసిన భూమా ఫ్యామిలీ ఇప్పుడు కష్టాల్లో ఉంటే ఎందుకు పార్టీ సపోర్ట్ చేయట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఈ వ్యవహారంలో రాజకీయ కుట్ర జరగుతోందని అఖిల ప్రియ సోదరుడు బహింరంగంగానే చెప్పినా కనీసం టీడీపీ నుండి ఎందుకు రెస్పాన్స్ లేదని...పరిణామాలను చూస్తుంటే కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ ప్రమేయం ఉందని పరోక్షంగా నేతలు భావిస్తున్నారు కాబట్టే స్పందిచట్లేరనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ కేసులో ముందు ఏ1గా ఉన్న ఏ.వి. సుబ్బారెడ్డిని తర్వాత ఏ2గా మార్చడం ఏ2గా ఉన్న అఖిల ప్రియను ఏ1గా చేర్చడంతోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో చేర్చిన సుబ్బారెడ్డి పేరును ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం అసలు తనకు ఎలాంటి సంబంధలేదనే విధంగా సీన్ క్రియేట్ చేస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అఖిల ప్రియ ఆరోగ్య పరిస్ధితుల దృష్యా బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయస్ధానం కొట్టివేసింది. ఐతే ముందు నమోదు చేసిన సెక్షన్లు కాకుండా మరికొన్ని సీరియస్ సెక్షన్లు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో భూమా ఫ్యామిలీని టార్గెట్ చేశారనే వాదనలకు కొన్ని ఉదాహరణలు బలానిస్తున్నాయి. భార్గవ్ రామ్ గత జీవితం సంబంధించి కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కిడ్నాప్ కేసును టైట్ చేస్తూ...అఖిల ప్రియ ఫ్యామిలీని ఇరకాటంలో పెడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.