Botsa Satyanarayana: అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం
Botsa Satyanarayana: పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక, పిల్లలను రెగ్యులర్ గా స్కూల్ కి పంపితే పథకం వర్తింపు
Botsa Satyanarayana: అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తమని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందని... పిల్లలను రెగ్యులర్ గా స్కూల్ కి పంపితే పథకం వర్తిస్తుందని తెలిపారు. ఇంటర్ ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని... 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని .
అమ్మఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామన్నారు. అమృత్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని ప్రతీ ఇంటికీ కొళాయి కలెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారని చెప్పారు.