AP News: ఏపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ
AP News: ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయనున్న బీజేపీ అధిష్టానం
AP News: మూడు విడతల్లో జాబితాను విడుదల చేసిన బీజేపీ.. తాజాగా ఏపీకి అభ్యర్థులను ఖరారు చేసింది. నిన్న జరిగిన సీఈసీ మీటింగ్‌లోనే ఏపీలో పోటీ చేయబోయే 6 ఎంపీ స్థానాలు... 10 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఈరోజు సాయంత్రానికి తుది జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది.
నిన్న మూడు గంటల పాటు సాగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో యూపీలో పది సీట్లు, ఒడిశాలో 21, రాజస్థాన్‌లో ఎనిమిది, బెంగాల్లో 18 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. వీటితోపాటే.. ఏపీకి చెందిన అభ్యర్థుల ఎంపిక సైతం జరిగినట్టు తెలుస్తుంది. పొత్తులో భాగంగా సమీకరణాలను మరోసారి పరిశీలించిన అధిష్టానం ఆ మేరకు ఆ స్థానాలకు క్యాండిడేట్లను ఫైనల్ చేసింది బీజేపీ. ఇవాళ బీజేపీ ఖరారు చేసిన జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదల్చిన బీజేపీ అభ్యర్థుల జాబితాపై కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. కాసేపట్లో ఈ జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాజమండ్రి నుండి ఎంపీగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి...రాజంపేట నుండి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి లేదా సాయి లోకేష్....అరకు నుండి కొత్తపల్లి గీత...తిరుపతి నుండి వరప్రసాద్ లేదా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ లేదా ఆమె కుమార్తె నిహారిక పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమచారం మరోవైపు.నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేర్లు వినిపిస్తున్నాయి.