ఏపీలో కొనసాగుతోన్న పోస్టల్‌ ఓట్ల లెక్కింపు.. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీడీపీ అభ్యర్థుల హవా..

ఏపీలో 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.

Update: 2024-06-04 03:05 GMT

ఏపీలో కొనసాగుతోన్న పోస్టల్‌ ఓట్ల లెక్కింపు.. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీడీపీ అభ్యర్థుల హవా..

ఏపీలో 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ ఓటు హక్కును సుమారు 4 లక్షల 61 వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారు వినియోగించుకున్నారు. వీరితో పాటు 80 ఏళ్లు పైబడిన వారు సుమారు 24 వేల మంది ఉన్నారు. మొత్తం మీద 5 లక్షలకుపైగా ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కారణంగానే పోస్టల్‌ ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లలో లెక్కింపు చేపడుతున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థుల హవా మొదలైంది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్ బుచ్చయ్య చౌదరి, నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారయణ ముందజలో కొనసాగుతున్నారు. ఇక కుప్పంలో 1549 ఓట్లతో చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు.

Tags:    

Similar News