MLC Madhav: గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల వల్లే.. పోలవరం ఆలస్యం
MLC Madhav: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది
MLC Madhav: గత ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్రప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే పోలవరం ప్రాజెక్టు ఆసల్యం అవుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు లోపాలపై విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో పూర్తవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు గత, ప్రస్తుత ప్రభుత్వాల అసమర్థ పనితీరుతో నేటికీ పూర్తికాలేదన్నారు. ఇచ్చిన మాట ప్రాకారం పోలవరం ప్రాజెక్టుపూర్తి చేసేందుకు కేంద్ర కట్టుబడి ఉందన్నారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే కేంద్రం రియంబర్స్ చేస్తుందన్నారు. అందుకే నేటికీ ఈ ప్రభుత్వం మ్యాన్యువల్ గానే.. బిల్లు సిద్ధం చేస్తున్నారన్నారు. పొలవరం ప్రాజెక్ట్ పునరావాస పరిహారం కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడంలేదన్నారు.