Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం..ఆ దర్శనాలు రద్దు
Tirumala News: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే టీటీడీ కీలక సంచలన ప్రకటన చేసింది. భారీ వర్షాల పడవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ.
TTD News: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే టీటీడీ కీలక సంచలన ప్రకటన చేసింది. భారీ వర్షాల పడవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అప్రమత్తమైంది. వర్షాలు భారీగా కురుస్తున్ననేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చి ఇబ్బందులకు గురి కాకుడదన్న ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
అక్టోబర్ 16వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా అక్టోబర్ 15వ తేదీన ఎలాంటి సిఫారసు స్వీకరించకూడదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.
తిరుపతికి భారీ వర్షం హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడారు. 48గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. 2021లో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనతో టీటీడీ 70పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళి రూపొందించిందని తెలిపారు. ఈ ప్రణాళిక బాగుందని..మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు ఈవో.