Bhimavaram: భీమవరం సోమేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ విజయలక్ష్మీ రాజీనామా

Bhimavaram: తన భర్త కోడె యుగంధర్ పురోహితునిపై దాడికి నైతిక బాధ్యత

Update: 2023-08-10 03:07 GMT

Bhimavaram: భీమవరం సోమేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ విజయలక్ష్మీ రాజీనామా

Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సోమేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్ విజయలక్ష్మీ రాజీనామా చేశారు. తన భర్త కోడె యుగంధర్ పురోహితునిపై దాడిచేసిన నేపథ‌్యంలో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన భర్తది తప్పు లేకపోయినప్పటికీ గుడిలో గొడవజరగడం బాధ్యత వహించి రాజీనామా చేశానన్నారు.

గునుపూడి సోమేశ్వరాలయం ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని దేవాదాయశా‌‌ఖ జాయింట్ కమిషనర్ సురేశ్ అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఆలయంలో పనిచేసే పూజారులకు, అధికారులకు, పాలకవర్గం పరస్పరం గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News