నాకు జగన్ అంటే గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం -బండ్ల గణేష్
Vijayasai Reddy Vs Bandla Ganesh: *విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఫైర్ *కులం ప్రస్తావన తేవడంపై బండ్ల గణేష్ అభ్యంతరం
Vijayasai Reddy Vs Bandla Ganesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత సర్కార్ తమ వర్గానికి చెందినవారికే ఉద్యోగాలు కల్పించేవారని ఆరోపించారు. అంతేకాదు టీడీపీ కుల పార్టీ అన్నారు విజయసాయి రెడ్డి. అయితే వైసీసీ సర్కార్ మాత్రం కుల, మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు విజయసాయి రెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైరయ్యారు. విజయసాయి కులం ప్రస్తావన తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నచ్చని వారిని పేరు పెట్టి తిట్టాలన్నారు. చంద్రబాబును అడ్డు పెట్టుకుని ఓవర్గం వారిని తిట్టకండన్నారు. తనకు జగన్ అంటే గౌరవం అన్న బండ్ల గణేష్.., విజయసాయి రెడ్డిని రాష్ట్రానికి పట్టిన దరిద్రమని ట్వీట్ చేశారు. అన్న నుంచి చెల్లిని దూరం చేయగల్గిన దగుల్బాజీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మీకు కులం నచ్చకుంటే ...కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి ... చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
అధికారం శాశ్వతం కాదు
రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు
ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు
నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదు@VSReddy_MP గారు
నాకు వైఎస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
నువ్వు పెద్ద దరిద్రానివి
మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లో కి లాగుతున్నవ్
కెసిఆర్ ను చూసి నేర్చుకో
అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు @VSReddy_MP