Balineni Srinivasa Reddy: జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ మాట్లాడాలి

Balineni Srinivas: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బయటకు వచ్చి మాట్లాడాలని మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరారు.

Update: 2024-10-28 05:58 GMT

Balineni Srinivas: జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ మాట్లాడాలి

Balineni Srinivasa Reddy: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బయటకు వచ్చి మాట్లాడాలని మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం ఉదయం హైద్రాబాద్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై ఆయన స్పందించారు. ఆస్తుల విషయంలో తగాదాలను మానుకోవాలని ఆయన జగన్ కు, షర్మిల కు హితవు పలికారు. దాదాపుగా 4 ఏళ్లుగా వీరిద్దరి మధ్యఆస్తుల గొడవ జరుగుతుందని ఆయన చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో ఆస్తుల విషయంలో ఆ కుటుంబంలో ఏం మాట్లాడుకున్నారనే విషయం విజయమ్మ మాత్రమే స్పష్టంగా చెబుతారన్నది ఆయన చెప్పారు. ఆస్తుల వివాదంలో ఎవరిది తప్పో, ఎవరిదో ఒప్పో ఆమెకు మాత్రమే తెలుసు...అందుకే ఎవరు ఏం చేశారో చెప్పాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఎవరూ కూడా బహిరంగంగా మాట్లాడడం సరైందికాదని ఆయన కోరారు.

2009 కి ముందు ఆస్తుల్లో వాటా అడుగుతున్నారా... 2009 తర్వాత ఆస్తుల్లో వాటా కోరుతున్నారో స్పష్టం చేయాలని షర్మిలను ప్రశ్నించాలని కోరారు. దీంట్లో స్పష్టత వస్తే ఇబ్బందులు లేవని ఆయన చెప్పారు. ఆస్తుల వివాదంలో పరస్పరలేఖలతో వైఎస్ జగన్, షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డిని బజారుకు ఈడుస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన హుందాగా బతికారని చెప్పారు.నాకు కూడా వైఎస్ఆర్ రాజకీయంగా బిక్షపెట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు.నేను, వైవీ సుబ్బారెడ్డి గానీ వైఎస్ విజయమ్మ వల్లే పైకి వచ్చామని ఆయన తెలిపారు.

ఐదేళ్లు జగన్ ఏం చేశారు?

వైఎస్ ను చంద్రబాబు చంపారని చెప్పడం దారుణమన్నారు. ఒకవేళ అదే నిజమని నమ్మితే ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఎందుకు విచారణ జరిపించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.జగన్, షర్మిల ఆస్తుల వివాదంలో చంద్రబాబుకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.

పార్టీ మారడం లేదు

తాను మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ సీపీలో ఎలా పనిచేశానో ఆ పార్టీ నాయకులకు తెలుసునన్నారు. ఆ పార్టీలో ఏం జరిగిందో ఇంతకుముందే చెప్పాను.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆయన చెప్పారు.

Tags:    

Similar News