Kadapa: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రచార జోరు

Kadapa: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ

Update: 2021-10-14 09:31 GMT

బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం జోరు (ఫైల్ ఇమేజ్)

Kadapa: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో భారీగానే నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల స్క్రుటీని అనంతరం 150 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో పోటీ తక్కువగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని స్థాయిలో ఏకంగా ఈ సారే అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉండటం విశేశం.

టీడీపీ, జనసేన ఈ ఎన్నికలకు దూరంగా ఉండగా వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. వైసీపీ నుంచి దాసరి సుధ, బీజేపీ నుంచి సురేష్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో ఉన్నారు. దీంతో త్రిముఖ పోరు ఉండనుంది. స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలు సైతం తమ ఉనికి చాటుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈనెల 30న బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు. 

Full View


Tags:    

Similar News