Guntur: పట్టుదలతో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆటో డ్రైవర్ భార్య

Guntur: నేటి యువతకు ఆదర‌్శంగా నిలుస్తున్న షీలా నిన్న భారతి, నేడు షీలా- చదువులో స్ఫూర్తిప్రదాతలు

Update: 2023-09-01 15:15 GMT

పట్టుదలతో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆటో డ్రైవర్ భార్య

Guntur: ఏదైనా సాధించాలనే పట్టుదల... తపన.. కోరిక ఉండాలే గానీ.. ఎంతటి విజయం అయినా మనముందుకు వచ్చి తీరాల్సిందే. అనుకున్నది సాధించాలంటే డబ్బు ఒక్కటే కాదు... అంతకు మించిన సంకల్పం కూడా తోడై ఉండాలి. దీనికి లింగ బేధం ఏమీ ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే పురుషుల కంటే మహిళలే ఈ కోవలో ఎక్కువగా ఉన్నారు. ఓ ఆటో డ్రైవర్ భార్య... ఎంతో పట్టుదలతో... ఎంతో కృషితో.. పీహెచ్ డీ పట్టా అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. గుంటూరు జిల్లాలో ఓ నిరుపేద మహిళ సాధించిన విజయం ఇది ..

నిరంతరం శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుంది అని ఏ కవి అన్నారో కానీ.. చాలామంది విషయాల్లో అది నిజమౌతుంది. మొన్న అనంతపురంలో ఓ మహిళ రసాయన శాస్త్రంలో PHD పూర్తి చేసింది. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లా పెదరావూరులో ఓ మహిళ PHD సాధించి...తన భర్త కలను నెరవేర్చింది. ఈమె పేరు షీలా. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరుకు చెందిన ఈమె...ఎన్నో కష్టాలు పడుతూ బతుకు జీవనం సాగిస్తుంది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్యల పెంపకంలో డిగ్రీ తొలి సంవత్సరం వరకూ చదువు కొనసాగించింది. అనంతరం గ్రామంలో వరుసకు మేనమామ అయిన ఆటో డ్రైవర్ రావూరి కరుణాకరర్‌ని వివాహం చేసుకుంది. జీవితంలో మంచి చదువు చదివి గొప్ప స్థాయిలో ఉండాలన్న ఆకాంక్ష షీలా మనుసులో బలంగా ఏర్పడింది.

భర్త కరుణాకర్‌కి చదువుకోవాలని ఉందని చెప్పడంతో ఆగిపోయిన డిగ్రీ చదువు కొనసాగించేలా భర్త బాసటగా నిలిచారు. రెండవ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకుని 2008లో మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో...ఆమె చదువుకు బ్రేక్ పడింది. అయినా ఆమె కుంగిపోలేదు. ఆ సమయంలోనే ఉచిత కంప్యూటర్ శిక్షణలో పీజీడీసీఎ పూర్తి చేసింది. షీలా మనసులో ఉద్యోగం చేయాలనే కోరిక బలంగా ఉండటంతో 2008లో తిరిగి బీకాం పూర్తి చేసింది. భర్త తోడ్పాటుతో ముందుకు సాగిన షీలా... తెనాలిలోని ఓ కాలేజ్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసుకుంది. జేఎంజే కాలేజ్ తెనాలిలో 2012లో ఎయిడెడ్ లెక్చరర్ పోస్ట్‌కి ధరఖాస్తు చేశారు. అయితే ఈ ఉద్యోగానికి PHD పూర్తి చేయాలని చెప్పడంతో... ఆమె ఎలాగైనా PHD పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు.

2014లో పడిన నోటిఫికేషన్లో PHD అప్లైచేసి నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ ఎన్.రత్నకిషోర్ దగ్గర ఎమ్ ఫిల్ ఫుల్ టైం రిసెర్చ్ స్కాలర్లో చేరింది. చదువు మధ్యలో ఆర్ధిక ఇబ్బందుల వల్లన చదువు ఆపాలనుకున్న తరుణంలో 2016 లో రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోఫిష్‌కు సెలెక్ట్ కావడంతో చదువు కొనసాగించింది. రోజు యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలో చదువుకుంటూ 2016 సెప్టెంబర్ లో ఏపీసెట్ క్యాలిపై అయింది. మొత్తానికి యూనివర్సిటీ 40 కన్వర్షన్లో పట్టా పొందడానికి అర్హత సాధించింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులమీద పట్టా తీసుకోవడం అనందంగా ఉందంటున్నారు.

ఒకపక్క పేదరికం... మరోపక్క కుటుంబ బాధ్యతలు.. ఇన్ని భారాలను భుజాలపై మోస్తూ....భర్త సహకారంతో విజయం సాధించిన షీలాను అందరూ అభినందిస్తున్నారు. మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆశీర్వదిస్తున్నారు. ఇటువంటి విజయాలు ఎందరికో ఆదర్శప్రాయం కావాలని కోరుకుంటున్నారు. 

Tags:    

Similar News