తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో...

Asani Cyclone Live Updates: ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు...

Update: 2022-05-08 06:45 GMT

తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో...

Asani Cyclone Live Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఈ తుఫాన్ 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

దీనిని అసానిగా నామకరణం చేశారు. విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఎల్లుండి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య కేంద్రీకృతం కానుండగా.. అదేరోజు దిశమార్చుకుని పశ్చిమబెంగాల్‌ వైపు పయనించే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News