ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు... కౌంటింగ్ ఎలా చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2024-05-26 07:03 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు... కౌంటింగ్ ఎలా చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.మే 13న రెండు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది.ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినందున పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే నిర్వహించారు.దేశ వ్యాప్తంగా జూన్ 4న పార్లమెంట్ తో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. జూన్ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో 25 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారు.రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 200 మంది కేంద్ర పరిశీలకులను నియమించింది ఈసీ. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరిగినందున ఇందుకు సంబంధించిన ఈవీఎంలు తారుమారు కాకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలను తరలించే సిబ్బందికి వేర్వేరు రంగుల దుస్తులను కేటాయించారు.ఒక్క రౌండ్ తర్వాత మరోరౌండ్ ఓట్లను లెక్కిస్తారు.ఒక్క రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాతే మరో రౌండ్ ఈవీఎంలను కౌంటింగ్ టేబుల్ వద్దకు చేర్చుతారు.పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఆయా పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజంట్ల సమక్షంలోనే కౌంటింగ్ నిర్వహిస్తారు. మూడు రోజుల క్రితం అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.కౌంటింగ్ ఏర్పాట్లపై దిశా, నిర్దేశం చేశారు.

తెలంగాణలో

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. రౌండ్ల వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు తీసుకువస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు.హైద్రాబాద్ లోనే 13 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో కౌంటింగ్ లో పాల్గొనే ఉద్యోగులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలిచ్చారు.

Tags:    

Similar News