‎R5 Zone: R5 జోన్‌పై ఏపీ హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

R5 Zone: పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు R5 జోన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Update: 2023-05-03 08:53 GMT

‎R5 Zone: R5 జోన్‌పై ఏపీ హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

R5 Zone: ఏపీలో R5 జోన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. రాజధాని కోసం భూములు సేకరించిన 29 గ్రామాల పరిధిలో ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం R5 జోన్‌ను తెరపైకి తెచ్చింది. దీంట్లో విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేష‌న్‌ విడుదల చేసింది. అందులో భాగంగా అమ‌రావ‌తిలో ప్రత్యేక జోన్‌ R5ను ఏర్పాటు చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు.. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలోని 9 వందల ఎకరాలను పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేసింది. R5 జోన్‌ పేరుతో 2022 అక్టోబరులో జీవో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 

Tags:    

Similar News