మనం తినే స్వీట్స్ సురక్షితమేనా?

దీపావళి పండుగ అంటేనే మనకి టపాకాయలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ.. దీపావళి అంటే స్వీట్లు కూడా... కచ్చితంగా అ రోజున ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక స్వీటు ఉండాల్సిందే.. పాత రోజుల్లో అయితే ఇంట్లోనే పిండి వంటలు తయారు చేసుకునేవారు.

Update: 2020-11-13 15:40 GMT

దీపావళి పండుగ అంటేనే మనకి టపాకాయలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ.. దీపావళి అంటే స్వీట్లు కూడా... కచ్చితంగా అ రోజున ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక స్వీటు ఉండాల్సిందే.. పాత రోజుల్లో అయితే ఇంట్లోనే పిండి వంటలు తయారు చేసుకునేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు. ఏది కావాలన్న సరే నిమిషంలోనే దొరుకుతున్నాయి.. అలా షాపుకు వెళ్ళామా ఇలా తెచ్చుకున్నమా.. తిన్నామా అంతే.. అయితే మనం అలా తింటున్న సీట్లు ఎంతవరకు సురక్షితం?

ఏ స్వీటు.. ఎన్ని రోజులు ఉంటుంది?

ప్రతి స్వీటు ఓ నిర్దిష్టమైన సమయం అనేది ఉంటుంది.. అయితే ఆ సమయం అయిన తర్వాత అది పాడైపోతుంది.. ఇటీవల రూపొందించిన నిబంధనల ప్రకారం.... కలాఖండ రకం స్వీట్లను ఒకరోజు మాత్రమే నిల్వ ఉంచాలి. నేతితో తయారు చేసిన స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, హల్వా, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. అంజీర్ కేక్. కాజా, లడ్డూ వంటివాటిని ఏడు రోజులు వరకు నిల్వ ఉంచవచ్చు..

ఇక బేసిన్ లడ్డు. ఆటలడ్డు, చానాలడ్డు, చనా బర్ఫీ, చిక్కోలు, వంటి వాటికి దాదాపు 30 రోజులు గడువు ఉంటుంది. పాల ఉత్పత్తులను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. అయితే దుకాణాల్లో ఎప్పటి నుంచి స్వీట్లు నిల్వ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ సీట్లను తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి స్వీట్ పై దాని ఎక్స్పైరీ డేట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆహార శాఖ అధికారులు చెబుతున్నారు.

నిబంధనలు పాటించకపోతే ?

ఒకవేళ నిబంధనలు పాటించకుండా ఉంటే మాత్రం ముందుగా హెచ్చరించి బోర్డులు ఏర్పాటు చేసుకునేందుకు వారం రోజులు గడువు ఇస్తారు. అప్పటికీ వినకపోతే వారిపైన కేసు నమోదు చేసి కోర్టులో జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరు పరుస్తారు. దీనితో వారికి సెక్షన్ 58 ప్రకారం రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అప్పటికి మారకపోతే మూడోసారి పట్టుబడితే ఏకంగా వ్యాపార లైసెన్స్లు రద్దు చేస్తారు ఇలాంటివి ఏమైనా ఉంటే అధికారాల దృష్టికి తీసుకువెళ్ళవచ్చు.. ఆహారభద్రత ప్రమాణాల చట్టం 2006 సవరిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News