Nellore: నెల్లూరులో అందుబాటులోకి వచ్చిన ARC ఫెర్టిలిటీ హాస్పిటల్
Nellore: మహిళా దినోత్సవం సందర్భంగా నెల పాటు.. 25 వేల కూపన్లు అందిస్తున్న యజమాన్యం
Nellore: భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన సంతాన సాఫల్య వైద్య కేంద్రాలలో ఒకటైన ARC హాస్పిటల్ నెల్లూరులో ప్రారంభమైంది. ఆధునిక వసతులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో సమకూరిన ఈ వైద్య కేంద్రాన్ని నెల్లూరు నగరంలోని దర్గామిట్ట సుజాతమ్మ కాలనీలో ప్రారంభించారు. ARC ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ హాస్పిటల్ మొత్తం 28 శాఖలను కలిగి ఉంది. వీటిలో కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రలతో పాటు శ్రీలంకలోనూ ఉన్నాయి.
శ్రీలంకలో IVF ల్యాబ్‌తో అన్ని సౌకర్యాలను కలిగి ఉన్న ఏకైక ఫెర్టిలిటీ హాస్పిటల్ ARC ఫెర్టిలిటీ హాస్పిటల్. గవర్నర్ రోశయ్య చేత గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో పాటు వరుసగా 3 సంవత్సరాలు ఉత్తమ ఫెర్టిలిటీ హాస్పిటల్ అవార్డులు అందుకుంది. అత్యంత విలువైన అవార్డు డోయెన్స్ అవార్డును మాజీ మంత్రి విజయభాస్కర్ నుండి పొందారు. 20 సంవత్సరాల అనుభవజ్ఞులైన ARC ఫెర్టిలిటీ హాస్పిటల్‌లో 50 వేల జంటలు సానుకూల ఫలితాలను పొందారు. తమ ఆసుపత్రి నుండి శిశువులతో అడుగుపెట్టారు. ARC హాస్పిటల్ 28 శాఖలు అన్ని సౌకర్యాలతో వారి వ్యక్తిగత IVF ల్యాబ్‌ను కలిగి ఉన్నాయి. ప్రతీ సంవత్సరం మహిళా దినోత్సవం నుంచి నెల రోజుల పాటు 25 వేల విలువైన కూపన్‌లను అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ ఆఫర్ అందుబాటులో ఉందని... జంటలు దీనిని ఉపయోగించుకోవాలని వైద్యులు తెలిపారు.