ఏపీలో డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీల పెంపు.. పెరిగిన టికెట్ల రేట్లు రేపటి నుంచి అమలు

Andhra Pradesh: పల్లెవెలుగు బస్సులో రూ.2 పెంపు.. ఎక్స్‌ప్రెస్‌లలో రూ.5, ఏసీ బస్‌లలో రూ.10 డీజిల్‌ సెస్‌ విధింపు

Update: 2022-04-13 10:58 GMT

ఏపీలో డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీల పెంపు.. పెరిగిన టికెట్ల రేట్లు రేపటి నుంచి అమలు

Andhra Pradesh: APSRTC ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో పల్లె వెలుగు బస్సుల్లో 2 రూపాయలు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 5రూపాయలు, ఏసీ బస్సుల్లో 10 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పల్లెవెలుగు బస్సుల్లోకనీస టికెట్ ధర 10 రూపాయలు అని తెలిపారు. పెరిగిన టికెట్ల రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నామని తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచుతున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. 

Tags:    

Similar News