AP Women And Child Welfare Office Employees Tested Corona Positive: ఏపీలో ఒకే ప్రభుత్వ కార్యాలయంలో ఏకంగా 33 మందికి కరోనా పాజిటివ్!
AP Women And Child Welfare Office Employees Tested Corona Positive: లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Women And Child Welfare Office Employees Tested Corona Positive: లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తాజాగా గుంటూరు జిల్లా, అమరావతి రోడ్డులో ఉన్న మహిళా శిశు సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో 33 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీనితో కార్యాలయాన్ని మూసి వేశారు అధికారులు.
ఈ కార్యాలయంలో ముందుగా ఆ కార్యాలయ రాష్ట్ర డైరెక్టర్ కు పాజిటివ్ నిర్ధారణ అవ్వగా, దాంతో ఆఫీస్ లో ఉండే మొత్తం 120 మంది ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు అధికారులు. దీనితో అందులో మొత్తం 33 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంఘటనతో వివిధ శాఖల ఉద్యోగులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ విధులను నిర్వహిస్తున్నారు.
ఇక ఏపీ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గడిచిన 24 గంటల్లో 1,263 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 424 మంది డిశ్చార్జ్ కాగా, 7 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17,365 కి చేరుకుంది. మృతుల సంఖ్య 239గా ఉంది.. ఇప్పటి వరకు 7252 మంది డిశ్చార్జ్ కాగా, 9874 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.