AP Schools Reopen On September 5: ఏపీలో పాఠ‌శాల‌ల‌ ప్రారంభానికి ఏర్పాట్లు.. ద‌స‌రా, సంక్రాంతి సెల‌వుల కుదింపు!

AP Schools Reopen On September 5: ప్ర‌పంచ‌ మాన‌వ‌ళి మ‌నుగ‌డ‌కే క‌రోనా స‌వాలుగా మారింది. ఈ వైర‌స్ దెబ్బ‌కు అన్నిరంగాలు సంక్షోభంలో ప‌డ్డాయి. అన్‌లాక్, కేంద్ర‌ స‌డ‌లింపుల త‌రువాత‌ కొన్ని రంగాలు .. ఇప్పుడిప్పుడే.. ఓ గాడిన ప‌డ్డాయి

Update: 2020-08-23 06:46 GMT

AP Schools Reopen

AP Schools Reopen On September 5: ప్ర‌పంచ‌ మాన‌వ‌ళి మ‌నుగ‌డ‌కే క‌రోనా స‌వాలుగా మారింది. ఈ వైర‌స్ దెబ్బ‌కు అన్నిరంగాలు సంక్షోభంలో ప‌డ్డాయి. అన్‌లాక్, కేంద్ర‌ స‌డ‌లింపుల త‌రువాత‌ కొన్ని రంగాలు .. ఇప్పుడిప్పుడే.. ఓ గాడిన ప‌డ్డాయి. కానీ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి విద్యా సంస్థలు, పాఠశాలు జూన్ 13 నాటికి తెరుచుకోవాల్సి ఉండ‌గా.. క‌రోనా విభృంజ‌న కొన‌సాగుతుండ‌టంతో వాయిదా పడ్డాయి.

ఏపీ స‌ర్కార్ మాత్రం సెప్టెంబ‌ర్‌ 5 నుంచి పాఠశాలలను తెర‌వ‌డానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దసరా, సంక్రాంతి సెలవులను కుదిస్తూ 181 రోజుల పనిదినాలు వచ్చేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ కేలండర్‌ను సిద్ధం చేసింది. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలా దీన్ని రూపొందించారు. దసరాకు ఐదు రోజులు, సంక్రాంతికి ఆరు రోజులు సెలవులు ఇవ్వనున్నారు. పాఠ్యాంశాలను 30 శాతం వరకు తగ్గించనున్నట్టు ప్రకటించారు.

పరీక్షల విషయానికి వస్తే అక్టోబరులో నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్‌)-1 పరీక్ష నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో సంగ్రహణ్మాతక మూల్యంకనం (సమ్మెటివ్‌)-1, మార్చిలో ఫార్మెటివ్‌-2, ఏప్రిల్‌లో సమ్మెటివ్‌-2 పరీక్షలు ఉంటాయి. అక్టోబరు 22 నుంచి 26 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా గ‌త విద్యా సంవత్సరం పూర్తికాకుండా ముందుగానే పాఠశాలలు మూతపడ్డాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. మహమ్మారి విజ‌ృంభించడంతో విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేసింది. 

Tags:    

Similar News