School Holidays: విద్యార్థులకు శుభవార్త.. సెలవులు పొడిగింపు..?

School Holidays: ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-06-07 05:50 GMT

School Holidays: విద్యార్థులకు శుభవార్త.. సెలవులు పొడిగింపు..?

School Holidays: ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. హాలీడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి రీఓపెన్ కానున్నాయి. అయితే, ఇప్పుడు స్కూళ్ల సెలవులు పొడిగించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం జూన్‌ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు జూన్‌ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే రోజు.. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజు పునఃప్రారంభంకానున్నాయి. దీంతో.. పాఠశాలలను ఈనెల 12కు బదులు 13న తెరవాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండడంతో వాయిదా వేయాలని వినతి చేశారు. దీంతో ఏపీలో స్కూల్స్ రీ ఓపన్ అయ్యే తేదీ మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News