AP Panchayati Elections: క్లైమాక్స్‌కు ఏపీ పంచాయతీ ఎన్నికలు

Panchayati Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి.

Update: 2021-02-19 11:24 GMT

ఏపీ పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికలు పూర్తవగా.. నాల్గొవిడత ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగో విడతలో మొత్తం 3 వేల 299 పంచాయతీలు, 33 వేల 435 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 553 సర్పంచ్‌ స్థానాలు, 10 వేల 921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డు స్థానాలకు ఈ నెల 21న పోలింగ్‌ జరగనుంది.

మరోవైపు.. ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలిచ్చారు. మూడు విడతల్లో ముగిసిన ఎన్నికలు, కౌంటింగ్ పై పలుచోట్ల ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చి నేపథ్యంలో ఎస్ఈసీ(sec) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లోని కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశాలు జారీ చేశారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు లేదా వీడియో గ్రఫీ తప్పకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఇక.. వీడియో రికార్డింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు నిమ్మగడ్డ(Nimmagadda) సూచించారు. అలాగే కౌటంగ్ కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించవద్దన్న నిమ్మగడ్డ.., గెలుపు, ఓటములకు పది ఓట్ల తేడా ఉంటేనే రీకౌటింగ్ చేపట్టాలని ఆదేశించారు. కౌంటింగ్ సందర్భంగా సమాచారం లీకవుకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News