AP new guidelines to discharge corona patients: ఇలాంటి కరోనా లక్షణాలుంటేనే ఇంటికి పంపుతారు.. ఏపీ ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు

AP new guidelines to discharge corona patients: ఏపీలో అవసరమైనంత మేర టెస్టులు చేస్తున్నా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతోంది.

Update: 2020-07-07 07:00 GMT

AP new guidelines to discharge corona patients: ఏపీలో అవసరమైనంత మేర టెస్టులు చేస్తున్నా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతోంది. దీనికి కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నాఅది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిషత్తులో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతాయి. ఇవి మరింత ఎక్కువైతే అవి కూడా చాలే పరిస్థితి లేదు. అందువల్ల కరోనా రోగుల విషయంలో కొన్ని సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా బాధితుల డిశ్చార్జ్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కరోనా వైరస్ విలయానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,320 మందికి పాజిటీవ్‌గా తేలడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,019కి ఎకబాకింది. ఏపీలో ఒక్క రోజులోనే 13వందలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

పరిస్థితి ఇలా ఉంటే కరోనా బాధితుల డిశ్చార్జ్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది. కరోనా లక్షణాలు లేకుండా పాజిటీవ్ వచ్చినవారిని కోవిడ్ 19 ఆస్పత్రికి తరలిస్తారు. కరోనాకు సంబంధించి తక్కువ లక్షణాలు ఉన్నవారిని పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉంచుతారు. కరోనా సీరియస్ కేసుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. డిశ్చార్జ్ ముందు 3 రోజుల పాటు ఎలాంటి లక్షణాలు ఉండకపోతేనే ఇంటికి పంపిస్తారు.

Tags:    

Similar News