AP Municipal Elections: గుంటూరు జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్‌

Ap municipal elections:ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

Update: 2021-03-14 06:13 GMT

 వైసీపీ.

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఎన్నికల్లో ఎక్కడా ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కొన్ని స్థానాలకే పరిమితం అవ్వగా.. నాలుగైదు సీట్లకు జనసేన -బీజేపీ కూటమి పరిమితం అవుతోంది. నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇక కనిరిగి మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో వైసిపి హవా కోనసాగింది. అక్కడ మొత్తం ఇప్పటివరకు 9 వార్డుల ఫలితాలు వెల్లడి. వైసిపి ఆరు ,టిడిపి3 స్థానాలకే పరిమితం అయ్యింది.

మరోవైపు గుంటూరు జిల్లాలలో కూడా వైసీపీ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. గుంటూరు సిటీ 7 వ డివిజన్ వైసీపీ గెలుపొందింది. గుంటురు జిల్లాలో తెనాలి, చిలకలూరి పేటలో కూడా వైసీపీ విజయం సాధించింది. ఇక సత్తనపల్లి, రేపల్లిలో కూడా వైసీపీ హావా కొనసాగుతుంది.ఇప్పటికే 30 శాతం మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే కచ్చితంగా హాఫ్ సెంచరీ కొట్టే దిశగా దూసుకుపోతోంది. డోన్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవారాల్ గా చూస్తే 25కు పైగా మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం అధికార్టీ 75 స్థానాల్లో 40 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ ఇంకా ఖాతా తెరవలేదు.  

Tags:    

Similar News