శ్రీశైలంలో అమ్మ వారిని దర్శించుకున్న ఏపీ మంత్రి సత్యనారాయణ
Minister Satyanarayana: రోడ్లు వెడల్పు చేయడానికి కావల్సిన భూమి కేటాయిస్తాం
Minister Satyanarayana: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. క్షేత్ర పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న రెండు వందల గదుల గణేష్ సదనాన్ని, మల్లమ్మ కన్నీరు, యాపి థియేటర్, డంపింగ్ యార్డ్, రోప్ వే, లాలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించారు. తర్వాత మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అటవీశాఖ సర్వేలో సరిహద్దులు గుర్తించారని తెలిపారు. ఈ సర్వే ద్వారా ఐదు వేల మూడు వందల ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోకి వస్తుందన్నారు. దీంతో క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రోడ్లు వెడల్పు చేయడానికి కావలిసిన భూమిని కేటాయిస్తామన్నారు.
చంద్రబాబు రోడ్ షోలో ప్రజలు లేక డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రానికి బాబు తన కష్టాలను చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మరోపక్క పవన్ కల్యాణ్ నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ విశాఖలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లోనే దేశ ప్రధాని మోడీని అడిగారని చెప్పారు.