AP Schools: ఆగస్టు 16 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామని తెలిపిన ఏపీ సర్కార్
AP Govt Schools: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాతే పాఠశాలలు తెరవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది.
AP Govt Schools - High Court: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాతే పాఠశాలలు తెరవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరుస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 60శాతం మందికి వ్యాక్సిన్ వేశామని కోర్టుకు వివరించింది. మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 11కి వాయిదా వేసింది.