నారాయ‌ణ బెయిల్ ర‌ద్దు కోరుతూ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

Narayana Bail: నారాయ‌ణ బెయిల్‌ను స‌వాల్ చేసే దిశ‌గా ఏపీ ప్రభుత్వం

Update: 2022-05-12 01:53 GMT

నారాయ‌ణ బెయిల్ ర‌ద్దు కోరుతూ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

Narayana Bail: పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి నారాయ‌ణ‌కు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ర‌ద్దు చేయించే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిశ‌గా ఏపీ ప్రభుత్వ వ‌ర్గాలు న్యాయ నిపుణుల‌తో చ‌ర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రశ్నప‌త్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నారాయ‌ణ‌కు చిత్తూరు కోర్టు వ్యక్తిగ‌త పూచీక‌త్తు మీద‌ బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో నారాయ‌ణ బెయిల్‌ను స‌వాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో ఇవాళ లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకే పేపర్​ లీక్​కు పాల్పడినట్లు వెల్లడించారు. నారాయణ ఆదేశాల మేరకు అక్రమాలు చేసినట్లు కళాశాల డీన్ బాలగంగాధర్ పోలీసులకు తెలిపారన్నారు. నారాయణ ప్రమేయం ఉండటం వల్లే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారన్నారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్ట్ చేయించేవారన్నారు. ఎన్నో ఏళ్లుగా పరీక్షల వ్యవస్థలో చెద పురుగుల్లా పట్టి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయని ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్​లో చైతన్య విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని వారినీ వదిలే ప్రసక్తి లేదన్నారు.

Tags:    

Similar News