ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Treasury Employees: ట్రెజరీ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.

Update: 2022-01-29 13:39 GMT

ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Treasury Employees: ట్రెజరీ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులకు ఇప్పటికే మెమోలు జారీ చేసింది జగన్ సర్కార్. ఉద్యోగుల జీతాలు తక్షణమే ప్రాసెస్‌ చేయాలని అధికారులకు ఆదేశించింది. కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామంది. సిబ్బంది సహకరించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News