మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌ మంజూరు

Narayana Bail: రాత్రి వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందుకు నారాయణ

Update: 2022-05-11 01:30 GMT

రాత్రికే రాత్రి నారాయణకు బెయిల్ మంజూరు

Narayana Bail: ఏపీ మాజీ మంత్రి నారాయణని హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు నారాయణను అరస్ట్ చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి నారాయణని పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గవర్నర్‌ కు వెంటనే లేఖ రాశారు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశ్యం ఉందన్నారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్‌లు జోడించి అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు. చిత్తూరు SP వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అని వెంటనే ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చెయ్యాలని కోరారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ లీకేజీ వెనుక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News