AP Employees: ఏపీ ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో సొమ్ము మాయం

AP Employees: ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, తాజాగా ఒకేసారి వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

Update: 2022-06-29 04:36 GMT

AP Employees: ఏపీ ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో సొమ్ము మాయం

AP Employees: ఏపీలో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లోని సొమ్ము వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. 1.7.2018 తర్వాత బకాయి ఉన్న పెండింగ్‌ డీఏల్లో ఒక డీఏ బకాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐదు విడతలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. జీపీఎఫ్‌ స్లిప్పులను కొందరు మంగళవారం డౌన్‌లోడ్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకం రేగింది. పలు సంఘాలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో ఉన్న 4.20 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ చర్య ద్వారా బాధితులుగా మారారని, ఇలా అనుమతి లేకుండా విత్‌ డ్రా చేసిన మొత్తం 800 కోట్ల పైనే ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

ఖాతాల్లో సొమ్ము మాయం కావడంపై పోలీసు కేసులు పెట్టడానికీ సంఘాలు సిద్ధమౌతున్నాయి. గతేడాది మార్చిలోనూ ఇలాగే ఒక విడత సొమ్మును ప్రభుత్వం మళ్ళించింది. తాజాగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యోగులకు తెలియకుండానే వారి ఖాతాల నుండి ప్రభుత్వం సొమ్మును వెనక్కి తీసుకుంది. ఇపీఎఫ్‌పై లోను ఇవ్వాలని ఉద్యోగులు ఎప్పటి నుండో దరఖాస్తులు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుకు మార్చి నెలలో 59వేల,038 విత్‌డ్రా చేసినట్లు తాజాగా రశీదు వచ్చింది. పీహెచ్‌సీలో పని చేసే మెడికల్‌ అఫీసర్‌కు 88వేల,726, మరో అధికారికి ఫిబ్రవరిలో రూ.లక్షా, 34వేల, మార్చిలో 64వేల,907 వారికి తెలియకుండానే విత్‌ డ్రా అయ్యింది. సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వం నియంత్రిస్తోంది.

Full View


Tags:    

Similar News