ఈ మూడు రోగాలకి ఎక్కడ కూడా చికిత్స లేదు : సీఎం జగన్

మూడో విడత కంటి వెలుగుకు కర్నూల్ లో శ్రీకారం చూట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అలాగే ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు

Update: 2020-02-18 09:18 GMT

మూడో విడత కంటి వెలుగుకు కర్నూల్ లో శ్రీకారం చూట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అలాగే ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్లు జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని పీహెచ్ ప్రమాణాలకు తీసుకొస్తామన్నారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆసుపత్రులను మార్చేస్తామని పేర్కొన్నారు. ఇక ఈ వేదికపైన జగన్ మాట్లాడుతూ అవ్వా తాతలకు ఎంత చేసినా తక్కువేనని భావించే వ్యక్తులలో మొదటివాడిని నేనని అన్నారు. పేద ప్రజలకోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.

ప్రతి పేద‌వాడికి వైద్యం అందించ‌డానికి డాక్టర్ లేడన్న భావన రాకూడదనే 66 ల‌క్షల మంది విద్యార్థుల‌కు ఉచితంగా కంటి ప‌రీక్షలు నిర్వహించామని జగన్ పేర్కొన్నారు. ఇక 4 ల‌క్షల 36 వేల మంది పిల్లల‌కు రెండోసారి స్క్రీనింగ్ చేశామన్నారు. ల‌క్షన్నర మందికి ఉచితంగా క‌ళ్లజోళ్లు ఇచ్చామని జగన్ తెలిపారు. మార్చి 1 నుంచి అవసరం మేరకు శస్త్రచికిత్సలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్‌ కంటి పరీక్షలను ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

అయితే ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేస్తుంటే కొందరికి చూడబుద్ది కావడంలేదని ప్రతిపక్షాలపై మండిపడ్డారు జగన్.. క్యాన్సర్ వస్తే ఆరోగ్య శ్రీలో చికిత్స ఉంది. అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా చికిత్స లేదు. కంటిచూపు మందగిస్తే కంటివెలుగులో చికిత్స ఉంది కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడ కూడా చికిత్స లేదు. ఇక వయసు మీదా పడి అనారోగ్యం పాలైతే చికిత్స ఉంది. కానీ మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేదని అన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొంతమంది ఛానళ్ళు, పత్రికలు ఉన్నాయని వాళ్ళను బాగుచేసే మందులు ఎక్కడ కూడా లేవని జగన్ సెటైర్లు వేశారు.  


Tags:    

Similar News