తుఫాన్ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

* అవసరమనుకుంటే పునరావాస శిబిరాలను తెరవాలని ఆదేశం.. బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలన్న సీఎం జగన్

Update: 2022-12-10 04:20 GMT

తుఫాన్ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

AP CM Jagan: తుఫాన్ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. వివిధ జిల్లాల్లో తుఫాన్ ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జగన్ ఆదేశించారు.

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఆ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవరమైన ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను తెరవాలని అధికారులను ఆ‍యన ఆదేశించారు. బాధితులకు అన్నిరకాల అండగా ఉండాలని ఆదేశించారాయన.

Tags:    

Similar News