దేవాలయాల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష, అర్చకులకు 20 శాతం జీతాల పెంపు

YS Jagan Review Meeting: టీటీడీ విధి విధానాలను అన్ని దేవాయాల్లో అమలు చేయాలని జగన్ సూచన

Update: 2021-09-28 04:00 GMT

దేవాలాయల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష, అర్చకులకు 20 శాతం జీతాల పెంపు

YS Jagan Review Meeting: వంశపారంపర్య అర్చకులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. వారికి 20 శాతం మేరకు జీతాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే ఆలయాల్లో టికెట్ల జారీకి ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తే.. ఎక్కడా కూడా అవినీతికి చోటు ఉండదని సీఎం స్పష్టం చేశారు.

టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లో ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా ఆన్‌లైన్ పద్దతులను కొనసాగించాలన్నారు. భక్తుల విరాళాలు పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలని అధికారులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. 

Tags:    

Similar News