మూడేళ్లలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ - సీఎం జగన్
*ఐటీ-ఎలక్ర్టానిక్ పాలసీపై ఏపీ సీఎం జగన్ సమీక్ష *విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటిపై చర్చ *ఐటీ, ఎలక్ర్టానిక్ పాలసీలో పెట్టాల్సిన అంశాలపై సూచనలు
రాబోయే మూడేళ్లలో అన్ని గ్రామాలకు ఇంటర్నెంట్ సదుపాయాన్ని కల్పించడమన్నది చాలా ముఖ్యమన్నారు ఏపీ సీఎం జగన్. ఐటీ, ఎలక్ర్టానిక్ పాలసీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ అంశంపైనా చర్చించారు. ఐటీ, ఎలక్ర్టానికి పాలసీ అంశాలపై సీఎం జగన్ సూచనలు చేశారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని., ఇంటర్నెట్ లైబ్రరీనీ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్క్ ఫ్రం హోంకు అవసరమైన అన్ని సదుపాయాలు ఇంచులో పెట్టాలని. ఈ లైబ్రరీ కోసం భవనం కూడా నిర్మించాలని.. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్ వర్క్ బలంగా లేకపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేమని సీఎం జగన్ చెప్పారు.