AP CM Jagan: తొలి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం

AP CM Jagan: ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు.

Update: 2021-08-03 12:22 GMT

AP CM Jagan: తొలి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం

AP CM Jagan: ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్క్‌ఫ్రమ్ హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్‌నెట్‌ను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న ముఖ్యమంత్రి ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తో పాటు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అటు గ్రామ సచివాలయాలకు. రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్‌నెట్ కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. మొదటి విడతలో 4వేల 530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్న సీఎం ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

Tags:    

Similar News