AP Budget 2021: తొలిసారిగా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
AP Budget 2021: ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
AP Budget 2021: ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన ఈ ఏడాదికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది 2 లక్షల 29 వేల 779 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టంది ప్రభుత్వం. గతేడాది 2 లక్షల 24 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం.. గత ఆర్థిక సంవత్సరం కంటే 4 వేల 990 కోట్లు అధిక కేటాయింపులు చేసింది ఈ ఏడాది బడ్జెట్‌లో.
ఇక.. తొలిసారిగా ఈ ఏడాది జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా మహిళలు, చిన్నారుల అభివృద్ధికి కేటాయింపులు చేసింది. 2021-22 వార్షిక బడ్జెట్‌లో 47వేల 283 కోట్ల జెండర్ బడ్జెట్‌ను కేటాయించింది. పిల్లలు, చిన్నారుల అభివృద్ధికి 16 వేల 748 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇక రైతులకు ఉచిత విద్యుత్ కోసం 6వేల 637 కోట్లు, పారిశ్రామికాభివృద్ధికి 3వేల 673 కోట్ల కేటాయింపులు చేశారు.