AP BJP: ఏపీ బీజేపీలో కోల్డ్ వార్.. పదాధికారుల సమావేశానికి సీనియర్లు డుమ్మా
AP BJP: అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి నిరాకరిస్తున్న సీనియర్లు
AP BJP: లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఏపీ బీజేపీలో కోల్డ్ వార్‌కు దారి తీసింది. తాజాగా విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. లోక్‌సభ టికెట్లు ఆశించి భంగపడిన సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ ఈ మీటింగ్‌కు హాజరుకాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. అనపర్తి నుంచి సోము వీర్రాజు, ధర్మవరం నుంచి సత్యకుమార్‌ను పోటీ చేయాలని పార్టీ కోరినా. ఆ ఇద్దరు నేతలు విముఖత చూపుతున్నట్లు సమాచారం.