Andhra Pradesh: ఈ నెల 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Andhra Pradesh: *12 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు *రేపు గౌతంరెడ్డి మృతిపై సంతాప తీర్మానం
Andhra Pradesh: ఈ నెల 25 వరకు 12 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు గౌతంరెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 10న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, 11న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇక 16, 17, 21, 22, 23, 24 తేదీల్లో బడ్జెట్ డిమాండ్‌లపై చర్చ జరగనుంది. ఈ నెల 9, 12, 13, 18, 19, 20 తేదీల్లో సభకు సెలవు ప్రకటించగా.. 25వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.