AP Assembly Meeting: వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

* వారం నుంచి 10రోజులపాటు సమావేశాలు * థర్డ్‌వేవ్‌ ప్రభావాన్నిబట్టి వచ్చే వారంలో నిర్ణయం

Update: 2021-08-20 07:37 GMT

ఏపీ అసెంబ్లీ (ఫోటో: ది హన్స్ ఇండియా)

AP Assembly Meeting: ఏపీ అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెల మూడో వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వారం నుంచి పది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. థర్డ్‌వేవ్‌ ప్రభావాన్ని బట్టి వచ్చే వారంలో చర్చించి ఈ సమావేశాల ప్రారంభ తేదీని, పని దినాలను ఖరారు చేసే అవకాశముందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ కారణంగా బడ్జెట్‌ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగేలేదు. అయితే వర్షాకాల సమావేశాలను వీలైనంత ఎక్కువ రోజులు జరపాలనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.

కేంద్రం సూచించిన సవరణలను పూర్తిచేసి 'దిశ' బిల్లును మరోసారి అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశాల్లో మండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మే నెలలో ఛైర్మన్‌, జూన్‌లో డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News