AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు సాగాయి. తొలిరోజు సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు. తర్వాత మూడు రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు శాసనసభలో విడుదల చేశారు.
మద్యం పాలసీ, శాంతి భద్రతలు, ఆర్థికశాఖలపై చంద్రబాబు శాసనసభ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.