ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు
ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి సిద్ధం అయ్యారు. అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 15 వందల 75 ఎకరాలను సీఆర్డీఏ నోటిఫై చేసింది. జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు సీఆర్డీఏ ప్రకటించింది. సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం నోటిఫై చేశారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెంలలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేశారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ పేరుతో గెజిట్ విడుదల అయింది.