AP Rains: వదలనంటున్న వరణుడు..బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..ఏపీకి భారీ వర్ష సూచన

Update: 2024-12-07 15:36 GMT

AP Rains: ఏపీని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు..తుఫాన్లతో కోస్తా తీరంపై ప్రభావం చూపుతోంది. గత పదిరోజులుగా ఫెంగల్ తుఫానుతో నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. ఇప్పుడు తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈనెల 11వ తేదీ నాటికి శ్రీలంక-తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

కాగా ఫెంగల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తిరుపతి, తిరుమలలోనూ భారీ వర్షాలు కురిసాయి. తిరుమలలో జలాశయాలు అన్నీ నిండు కుండలా మారాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడనం ధ్రోణి రానున్న నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచనతో మరోసారి అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. భారీ నష్టాలతో ఇప్పటికే పంటలకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది.

Tags:    

Similar News