Tirumala: తిరుమల వేదపాఠశాలలో ఆగని కరోనా కేసులు
Tirumala: తిరుమల వేదపాఠశాలలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు.
Tirumala: తిరుమల వేదపాఠశాలలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. ఇవాళ ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వేదపాఠశాలకు టీటీడీ అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో 357 మంది విద్యార్థులు సొంతగ్రామాలకు వెళ్లిపోయారు.
మార్చి 10న వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూడటంతో.. సోమవారం 75 మందికి కరోనా టెస్టులు చేయగా.. మరో 10 మందికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి వేద పాఠశాలలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 420 మంది విద్యార్థులు వేదాలను అభ్యసిస్తున్నారు.