ఇద్దరు ఒక్కటయ్యారు..?సుప్రీం తీర్పు తర్వాత మారిన పరిణామాలు

*సుప్రీం తీర్పు తర్వాత రాష్ట్రంలో మారిన పరిణామాలు *ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన ఎస్‌ఈసీ, వైసీపీ ప్రభుత్వం *సిబ్బంది కొరతపై దృష్టి పెట్టిన ఎస్‌ఈసీ, జగన్ ప్రభుత్వం *కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్

Update: 2021-01-26 14:30 GMT

నిమ్మగడ్డ రమేష్ , వైస్ జగన్ 

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉపు నిప్పుగా ఉన్న ఎస్ఈసీ, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కటయ్యారు. ఎన్నికల నిర్వహణపై కలిసే కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలకు.. వ్యాక్సినేషన్‌కు సిబ్బంది కొరత లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు కేంద్రసాయం కూడా కోరుతున్నారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీలో పరిణామాలు చాలా స్పీడ్‌గా మారుతున్నాయి. రేపు ఎస్ఈసీ రాష్ట్రంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని సీఎస్ అదిత్యనాధ్ దాస్ ఇప్పటికే అదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సుప్రీం తీర్పుపై వైసీపీ నేతలు కిక్కురుమనడం లేదు. ఇటు వైసీపీ నేతలపై ప్రతిపక్షాలు కూడా ఊహించిన స్థాయిలో విమర్శించడం లేదు.

ఎన్నికలను రీ షెడ్యూల్ చేయడం వల్ల ప్రభుత్వానికి కొంత రిలీఫ్‌ దొరికినట్లయింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ విధులను పక్కనపెట్టి, ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం లేదు. అదనపు సిబ్బంది కోసం ప్రభుత్వంతో పాటు ఎస్‌ఈసీ కూడా దారులు వెతుక్కోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చిన జగన్‌ సర్కార్‌, నిమ్మగడ్డ రమేష్‌ ఇప్పుడు సిబ్బంది కొరతపై దృష్టిసారించారు. సిబ్బంది, బలగాలను కేటాయించాలని ఇరువురు కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్రం ఈ లేఖలపై రేపోమాపో స్పందించనుంది. 

Tags:    

Similar News