Junior Doctors Stipend increased in AP: ఏపీలో జూనియర్ డాక్టర్ల స్తైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు
Junior Doctors Stipend increased in AP: ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Junior Doctors Stipend increased in AP: ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో హౌస్ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు వర్తిస్తుంది.
స్టైఫండ్ పెంపుదల ఇలా..
- ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589
- పీజీ డిగ్రీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075
- రెండో ఏడాది రూ.46,524, ముడో ఏడాది రూ.48, 973 పెరగనుంది.
- అదే విధంగా పీజీ డిప్లొమా విద్యార్థులకు మొదటి రూ.44,075
- రెండో ఏడాది రూ.46524 పెంపు వర్తిస్తుంది.
- సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.48,973
- రెండో ఏడాది రూ.51,422
- మూడో ఏడాది రూ.53,899 పెరగనుంది.
- ఎండీఎస్ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075
- రెండో ఏడాది రూ.46,524
- మూడో ఏడాది రూ.48,973 పెంపుదల ఉంది.